అచ్చ తెలుగు నటి అర్చన ప్రధాన పాత్రలో టి. కృష్ణ దర్శకత్వంలో వి.ఆర్.బాబు నిర్మించనున్న కొత్త చిత్రం సివంగి. తెలుగు క్రియేషన్స్ పతాకంపై రూపుదిద్దుకుంటోన్న ఈ చిత్రం షూటింగ్‌ను ఏప్రిల్ మూడో వారంలో ప్రారంభించనున్నారు. ఈ చిత్ర విశేషాల గురించి దర్శకుడు మాట్లాడుతూ
కథపరంగా చిత్రంలోని కొన్ని సన్నివేశాలను, రెండు పాటలను బ్యాంకాంక్‌లో చిత్రీకరించనున్నట్టు తెలిపారు. నాజర్, భానుప్రియ, చంద్రమోహన్, తెలంగాణా శకుంతల, కొండవలస, సుమన్ శెట్టి, రామిరెడ్డిలు ముఖ్యపాత్రలు పోషిస్తున్న ఈ చిత్రంలో ప్రత్యేక పాత్రలో థ్రిల్లర్ మంజు నటించనున్నట్లు ఆయన తెలిపారు. అలాగే ఈ చిత్రంలో ఓ ప్రముఖ హీరో విలన్‌గా నటించనున్నారని ఆయన పేర్కొన్నారు.
ఈ చిత్రం గురించి అర్చన మాట్లాడుతూ ఎంతో కాలంగా ఇటువంటి క్యారెక్టర్ చేయాలని ఎదురుచూశానని, లేడీ ఓరియెంటెడ్ కథాంశంతో ఈ చిత్రం తయారవుతోందని పేర్కొంది.
నిర్మాత మాట్లాడుతూ నేటి రాజకీయ పరిస్థితులకు అనుగుణంగా తీర్చిదిద్దుతున్న కథ ఇదని, పోలీసు వ్యవస్థకు, రాజకీయ వ్యవస్థకు మధ్య జరిగే కథాంశమే ఈ సినిమా అని అన్నారు.
ఈ చిత్రానికి మాటలు- దాసం వెంకట్రావ్, పాటలు- సుద్దాల అశోక్ తేజ, గోరెటి వెంకన్న, సూరిశెట్టి రామారావు, సంగీతం- వందేమాతరం శ్రీనివాస్, కెమెరా- అడుసుమిల్లి విజయ్ కుమార్.
0 Comments:
Post a Comment