ఛార్మి ప్రధాన పాత్రలో తాజాగా విడుదలైన చిత్రం మనోరమ. ఉగాదికి ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ చిత్రానికి చక్కటి ఆదరణ లభిస్తోందని చిత్ర దర్శకుడు ఈశ్వర్‌రెడ్డి పేర్కొన్నారు. ఫిలింఛాంబర్‌లో నిర్వహించిన చిత్ర సక్సెస్ మీట్‌లో పాల్గొన్న ఈశ్వర్‌రెడ్డి మాట్లాడుతూ వైవిధ్యభరితంగా చిత్రాన్ని నిర్మించామని, దానికి తగ్గ ఫలితం లభించిందన్నారు.
చిత్రం కోసం కోఠి సెంటర్ సెట్‌వేసి మొత్తం చిత్రాన్ని అక్కడే చిత్రీకరించామని ఆయన పేర్కొన్నారు. ప్రస్తుతం విద్యార్ధులకు పరీక్షలు జరుగుతున్నాయని, ఇవి పూర్తయితే తమ చిత్రానికి మరింత ఆదరణ లభిస్తుందని ఆయన పేర్కొన్నారు. చిత్ర ఎగ్జిక్యూటివ్ నిర్మాత సురేష్ మాట్లాడుతూ మనోరమ చిత్రాన్ని జీ మోషన్ సంస్థ నిర్మించిన కారణంగా ప్రమోషన్ కోసం తాము ఎలాంటి కష్టాన్ని ఎదుర్కోలేదన్నారు.
ఈ కారణంగానే చిత్రాన్ని అనుకున్న టైంకు విడుదల చేయగలిగామని ఆయన తెలిపారు. దర్శకుడు కథ చెప్పినపుడు నచ్చి పరిమిత బడ్జెట్‌తో చిత్రాన్ని నిర్మించామని ప్రస్తుతం చిత్రానికి కలెక్షన్లు బాగున్నాయని ఆయన పేర్కొన్నారు.
0 Comments:
Post a Comment