Search Any Movies Links for Download Here
Perfectmatch.com

Wednesday, April 1, 2009

మళ్లీ తెరమీదకు వచ్చేందుకు 'ఆర్తీ' రెడీ

Arthi
నువ్వు నాకు నచ్చావ్ అంటూ మెప్పించి అందాలరాముడుతో అలరించిన బొద్దుగుమ్మ ఆర్తీ అగర్వాల్‌ దాదాపు రెండేళ్లుగా తెలుగు తెరనుంచి మాయమైన సంగతి తెలిసిందే. ఎవో తెలియని కారణాలతో ఆత్మహత్యా ప్రయత్నం చేసి అటుపై అమెరికాకు చెందిన ఓ వ్యాపారవేత్తను పెళ్లి చేసుకుని వెళ్లిపోయిన ఆర్తీ అగర్వాల్ మళ్లీ వెండితెరపై కనిపించేందుకు సిద్ధమవుతోంది. 

ఇందుకోసం అమెరికానుంచి ఆంధ్రాకు చేరుకున్న ఆర్తీ తెలుగులో పునఃప్రవేశానికి తాను సిద్ధంగా ఉన్నానంటూ ప్రకటించింది. ఈ సందర్భంగా తన గురించి తాజా విశేషాలను ఆర్తీ విలేకరులతో పంచుకుంది. పెళ్లి చేసుకుని అమెరికాలో కాపురం పెట్టిన తనకు గృహిణిగా జీవితం బాగానే ఉందని అయితే ఈమధ్య బోర్‌గా అనిపిస్తోందని ఆర్తీ ఈ సందర్భంగా చెప్పుకొచ్చింది. తన బోర్‌ ఫీలింగ్‌ను గమనించి మళ్లీ సినిమాల్లో నటించు అంటూ తన భర్త ఉజ్వల్‌కుమార్ తనకు సలహా ఇచ్చారని ఆయన సలహా మేరకే మళ్లీ సినిమాల్లో నటించేందుకు సిద్ధమయ్యాయని తెలిపింది. 

అయితే పెళ్లి తర్వాత సినిమాల్లో నటించే హీరోయిన్లు కేరెక్టర్ ఆర్టిస్టులుగా మారిపోతారని తాను మాత్రం మళ్లీ హీరోయిన్‌గానే నటిస్తానని స్పష్టం చేసింది. తనకంటూ ప్రత్యేకమైన ఫ్యాన్స్ ఉన్నారని తాను హీరోయిన్‌గా నటిస్తే వారు తప్పకుండా ప్రోత్సహిస్తారని చెప్పింది. తాను చివరగా తెలుగులో నటించిన గోరింటాకు చిత్రంలో కాస్త లావుగా ఉన్నా ప్రస్తుతం బాగా స్లిమ్‌గా తయారు కావడానికి చాలా కష్టపడ్డానని, యోగా, వ్యాయామాలతో మళ్లీ తన పాత రూపానికి చేరుకున్నానని తెలిపింది. 

తాను సినిమాల్లోంచి వెళ్లిపోయాక చాలామంది కొత్తహీరోయిన్లు వచ్చినా, తానూ బెటర్‌గా చేయగలనని ఆర్తీ విశ్వాసం వ్యక్తం చేసింది. ప్రస్తుతం తాను తెలుగు చిత్రాల్లోనే నటిస్తానని, అటుపై కథలు నచ్చితే ఇతర భాషా చిత్రాల గురించి ఆలోచిస్తానని ఆర్తీ పేర్కొంది. ఇప్పుడు తాను మరికొద్ది రోజులపాటు కెరీర్ గురించి మాత్రమే ఆలోచించదలిచానని అందుకే పిల్లల గురించి ఇప్పట్లో ఆలోచించదల్చుకోలేదని చెప్పుకొచ్చింది. 

వెండితెరపై పునఃప్రవేశం సందర్భంగా తాను ప్రస్తుతం సూపర్‌గుడ్ ఫిలింస్ బేనర్‌లో నటించనున్నానని అయితే ఈ విషయం ఇంకా నిర్ధారించాల్సి ఉందని ఆర్తీ పేర్కొంది. తగిన కథ దొరికితే యూత్ హీరోలతోనూ నటించడానికి తాను సిద్ధంగా ఉన్నానని ఆర్తీ చివరగా ముక్తాయించింది. 

0 Comments:

Online Movie Theatre | Movies Online