Search Any Movies Links for Download Here
Perfectmatch.com

Wednesday, April 1, 2009

రేపు యువరత్న 'మిత్రుడు' పాటలు విడుదల


Balakrishna
యువరత్న బాలకృష్ణ, ప్రియమణి జంటగా నటిస్తోన్న చిత్రం మిత్రుడు. వైష్ణవి సినిమా పతాకంపై శివలెంక కృష్ణ ప్రసాద్ నిర్మిస్తోన్న ఈ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌ ద్వారా మహాదేవ్ దర్శకుడిగా పరిచయమవుతున్నారు. ఇప్పటికే ఒకపాట మినహా ఈ చిత్రం షూటింగ్ పూర్తయింది. ఈ చిత్రం ఆడియోను ఏప్రిల్ 2న లహరి మ్యూజిక్ ద్వారా నేరుగా మార్కెట్లోకి విడుదల చేస్తున్నట్లు నిర్మాత తెలిపారు. 

బాలకృష్ణ, మణిశర్మ కాంబినేషన్‌లో వచ్చిన చిత్రాలు గతంలో మ్యూజికల్ హిట్స్‌గా నిలిచాయని ఈ చిత్రానికి కూడా మణిశర్మ అందించిన సంగీతం ప్రేక్షకులను ఎంతగానో అలరిస్తుందని నిర్మాత నమ్మకం వ్యక్తం చేశారు. ఇందులో ఆరు పాటలు ఉంటాయని, ఒక పాటను మాత్రం చిత్రీకరించాల్సి ఉందని, త్వరలోనే ఆ పాటను చిత్రీకరిస్తామని ఆయన చెప్పారు.

మరోవైపు నిర్మాణానంతర కార్యక్రమాల్లో భాగంగా డబ్బింగ్ పూర్తయిందని, రీరికార్డింగ్ కూడా ప్రారంభమైందని నిర్మాత వివరించారు. హైదరాబాద్‌తో పాటు మలేషియాలో కూడా ఈ చిత్రం షూటింగ్ జరిపామని, విజయేంద్ర ప్రసాద్ అద్భుతమైన కథకు ఎం. రత్నం చక్కటి సంభాషణలు సమకూర్చారని నిర్మాత వెల్లడించారు. అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకుని ఏప్రిల్ నెలాఖరుకు సినిమాను విడుదల చేస్తామని ఆయన తెలిపారు.

0 Comments:

Online Movie Theatre | Movies Online