Search Any Movies Links for Download Here
Perfectmatch.com

Friday, March 20, 2009

భవాని ఐపీఎస్‌గా ప్రేక్షకుల ముందుకు స్నేహ

Sneha
స్నేహ టైటిల్ పాత్రలో రూపొందుతున్న చిత్రం భవాని ఐపీఎస్. తెలుగు, తమిళ భాషల్లో నిర్మితమవుతున్న ఈ చిత్రానికి జి. కిచ దర్శకత్వం వహిస్తున్నారు. నానక్‌రామ్‌గూడా సినీ విలేజ్‌ స్టూడియోలో గత కొద్దిరోజులుగా ఈ సినిమా షూటింగ్ జరుగుతోంది. 

ఈ సందర్భంగా చిత్ర విశేషాల గురించి దర్శకుడు తెలియజేస్తూ లేడీ ఓరియెంటెడ్ సబ్జెక్ట్‌తో కూడిన చిత్రమిదన్నారు. స్నేహ పవర్‌ఫుల్ పోలీస్‌ ఆఫీసర్‌గా నటిస్తోందని, ఇందులో నాలుగు పాటలున్నాయని ఆయన వివరించారు. స్నేహ సినీ కెరీర్‌లో భవాని ఐపీఎస్, మరో మంచి చిత్రమవుతుందని ఆయన అన్నారు. 

స్నేహ మాట్లాడుతూ శ్రీరామదాసు, రాధాగోపాళం వంటి సినిమాలు చేసిన తను, భవాని చిత్రంలో వైవిధ్య పాత్రను పోషిస్తున్నానని చెప్పారు. ఇప్పటికే 90 శాతం షూటింగ్ పూర్తయిందని, ఇలాంటి క్యారెక్టర్‌ కూడా చేయగలనా? అని తనకే అనిపించిందని స్నేహ వెల్లడించారు. 

కోట శ్రీనివాసరావు మాట్లాడుతూ ఇప్పటి పరిస్థితులకు అనుగుణంగా పోలీసు వ్యవస్థలో ఉన్న మార్పుల్ని, పరిస్థితుల్ని కిచ చక్కగా తెరకెక్కిస్తున్నారని చెప్పారు. రొటీన్ రాజకీయవేత్త అయినా కొత్తదనంగా తనను దర్శకుడు ప్రెజెంట్ చేశాడని అన్నారు.

పొన్నాంబళం, బ్రహ్మానందం, ఆర్యన్ తదితరులు నటిస్తున్న ఈ చిత్రానికి కెమేరా- కె. భూపతి, సంగీతం- దిన, స్క్రీన్‌ప్లే, మాటలు, దర్శకత్వం- జి. కిచ, ఎం. షాగూల్ హమీద్.

0 Comments:

Online Movie Theatre | Movies Online