Search Any Movies Links for Download Here
Perfectmatch.com

Friday, March 20, 2009

ఉగాది కానుకగా ఛార్మీ 'మనోరమ'

Charmi
ఛార్మి ప్రధాన పాత్రలో నటిస్తోన్న చిత్రం 'మనోరమ'. జీ మోషన్ పిక్చర్స్ నిర్మిస్తోన్న ఈ చిత్రాన్ని ఉగాదికి ప్రేక్షకుల ముందుకు తెచ్చేందుకు సన్నాహాలు చేస్తున్నట్లు చిత్ర నిర్మాత, నటుడు సురేష్ తెలిపారు. ఈ విషయమై బుధవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో సురేష్ మాట్లాడుతూ చిత్ర దర్శకుడు ఈశ్వర్ రెడ్డి తొలి చిత్రం "మీ శ్రేయోభిలాషి"ని చూసి ఆయన దర్శకత్వంలో సినిమా చేయాలనుకున్నానని చెప్పారు. 

ఇలాంటి తరుణంలో ఆయన ఓ కథ చెప్పడం, అది అందరికీ నచ్చడంతో మా సంస్థలో ఈ సినిమాను నిర్మించామని తెలిపారు. ఈ సినిమాకు కోటి చక్కని సంగీతం సమకూర్చారని డిజిటల్ ఫార్మెట్‌లో ఈ చిత్రాన్ని రూపొందించామని సురేష్ అన్నారు. అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకుని "మనోరమ"ను ఉగాది నాడు ప్రేక్షకుల ముందుకు తెచ్చేందుకు సన్నాహాలు చేస్తున్నామని చెప్పారు. 

ఛార్మి మాట్లాడుతూ ఒక్కరోజులో జరిగే కథతో ఈ చిత్రం రూపొందిందన్నారు. దర్శకుడు కథ చెప్పిన తీరు చాలా బాగుందని, సినిమా బాగుంటే ఆ క్రిడిట్ దర్శకుడిదేనని ఆమె తెలిపారు. లైఫ్ అంటే ఎంజాయ్ చేయాలి-అనే సాంగ్ ఇందులో తనకు బాగా నచ్చిందని ఛార్మి పేర్కొంది. 

సంగీతానికి ప్రాధాన్యత గల కథతో రూపుదిద్దుకుంటోన్న ఈ చిత్రానికి మ్యూజిక్ హైలైట్ అవుతుందని కోటి అన్నారు. ఖర్చు ఎక్కువైనా నిర్మాతలు సహకరించారని ఆయన చెప్పారు.

ఈ చిత్రంలోని ఇతరపాత్రల్లో నిషాన్, అలీ, ఎం.ఎస్. నారాయణ, ప్రదీప్, ధనుష్, విశ్వేశ్వరరావు, శ్రీ వాత్సవ్ తదితరులు నటించారు. ఈ చిత్రానికి కథ, మాటలు- పద్మశ్రీ, కెమేరా- జగన్, జె.ఆర్.జె, ఆర్ట్- అశోక్, నిర్మాత- పి. గోయెంకా, స్క్రీన్‌ప్లే, దర్శకత్వం- వి. ఈశ్వర్ రెడ్డి.

0 Comments:

Online Movie Theatre | Movies Online